8 Dec 2022

తేరి రీమేక్ పై ఆగ్రహంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

 

Pawan Kalyan fans became angry on Theri remake news

ఇటీవలే 'సాహో' దర్శకుడు సుజీత్ తో పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఎనౌన్స్ చేయడంతో పవన్ అభిమానులు ఎంతగానో సంతోషించారు. కానీ తాజాగా ఆయన నటించబోయే తదుపరి చిత్రం గురించి వచ్చిన తాజా వార్తలు వారికి తీవ్రమైన నిరాశను కలిగిస్తున్నాయి.

తమ అభిమాన హీరో నటించే కొత్త సినిమా ప్రకటన వస్తుందని ఆ అప్ డేట్ కోసం వేచి చూస్తున్న వారికి ఈరోజు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాకు రీమేక్ చేయనున్నారని తెలిసిన తర్వాత ఆగ్రహానికి లోనయ్యారు.

#wedontwanttheriremake అనే హ్యాష్ ట్యాగ్ తో నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ చేసి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వారు తమ ట్వీట్లలో దర్శకుడు హరీష్ శంకర్ ను ట్యాగ్ చేయడం ప్రారంభించారు మరియు ఈ అంశంపై స్పష్టత కోరుతున్నారు. 

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత ఆవేదన చెందినా. ఎంత ఆవేశానికి లోనైనా.. తేరి రీమేక్ దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.


No comments:

Post a Comment