30 Dec 2022

Dhamaka Collections: రవితేజ ధమాకా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Dhamaka 1St Week Worldwide Collections


మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. ఈ చిత్రం గతవారం థియేటర్ల లో విడుదల అయ్యి నెగటివ్ రివ్యులను సొంతం చేసుకున్నా.. ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఈ సినిమాకి అద్భుతమైన ఆదరణ అందించారు.

ఫలితంగా ధమాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పాటు హీరోయిన్ శ్రీ లీల గ్లామర్, డాన్స్, అలాగే భీమ్స్ అందించిన పాటలు ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించాయి. అన్నీ కలిసి ధమాకా సినిమా టైటిల్ కి తగ్గట్టు బాక్సాఫీస్ వద్ద కూడా విధ్వంసం సృష్టించింది.

ఈ చిత్రం వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ధమాకా చిత్రం నైజాం ఏరియాలో 9.90 కోట్ల షేర్ రాబట్టగా, సీడెడ్ లో 3.40 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.68 కోట్లు, ఈస్ట్ లో.1.26 కోట్లు, వెస్ట్ లో 0.88 కోట్లు, కృష్ణాలో 1.12 కోట్లు, గుంటూరు లో 1.24 కోట్లు, నెల్లూరు లో 0.60 కోట్లు వసూలు చేసింది.

ఇక కర్ణాటకలో ధమాకా 1.75 కోట్ల షేర్ వసూలు చేయగా, ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ఏరియాలు కలుపుకుని 2.20 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా మొదటి వారంలో ధమాకా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 25.03 కోట్ల షేర్ వసూలు చేసింది. రవితేజ కెరీర్ లోనే భారీ హిట్ లలో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇదే హవాను కొనసాగిస్తే, ఆయన కెరీర్లోనే అతి పెద్ద విజయంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటించారు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా కి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. 

No comments:

Post a Comment