28 Dec 2022

Rashmika Mandanna: తాజా వ్యాఖ్యల కారణంగా మరోసారి వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్న

Rashmika lands in another controversy because of her latest comments


ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న కన్నడ సినిమా కాంతారను చూడలేదని, ఆ సినిమా దర్శకుడు,నటుడు అయిన రిషబ్ శెట్టి గురించి సరిగా మాట్లాడలేదని పెద్ద వివాదం చెలరేగింది. ఆ విషయంలో కొంతమంది తోటి ఆర్టిస్టులు ఆమెకు మద్దతుగా నిలిచారు. 

ఇక ఆ వివాదం సద్దుమణిగింది అనుకుంటుండగా.. తాజాగా దక్షిణ భారత సినిమాల్లోని పాటలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కారణంగా రష్మిక దక్షిణాది అభిమానుల ఆగ్రహానికి గురై మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు 

రష్మిక మందన్న ప్రస్తుతం తన కొత్త బాలీవుడ్ చిత్రం మిషన్ మజ్ను ప్రమోషన్‌లలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. రొమాంటిక్ సాంగ్స్ విషయంలో బాలీవుడ్ బెస్ట్ అని, చిన్నప్పటి నుంచి తనకు అవి ఇష్టమని రష్మిక అభిప్రాయపడ్డారు.

ఇక సౌత్ సినిమాలలో ఎక్కువగా మాస్ మసాలా పాటలు, ఐటెం నంబర్లు మరియు డ్యాన్స్ నంబర్లు ప్రసిద్ధి చెందాయని రష్మిక అన్నారు. అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే సౌత్ సినిమాని కించపరిచిందని నెటిజన్లు వ్యాఖ్యానించడం ప్రారంభించారు మరియు రష్మిక వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

No comments:

Post a Comment