15 Dec 2022

Unstoppable: పవన్ తో పాటు బాలయ్య షోలో వచ్చేది వాళ్ళేనా?

These two directors coming along with Pawan Kalyan for Balayya's Unstoppable?


నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో అన్ స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తున్నారని దాదాపు ధృవీకరించబడింది. ప్రముఖ మీడియా ప్రతినిధులతో పాటు ఈ షో నిర్వహిస్తున్న ఆహా వీడియో వారు కూడా ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ త్వరలో 'అన్ స్టాపబుల్' స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొంటారని అర్థమవుతుండగా, ఆయనతో పాటు హాజరయ్యే మరో ఇద్దరు ఎవరనే విషయం పై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్, క్రిష్ కూడా ఉంటారని తెలుస్తోంది. ప్రధానంగా దృష్టి అంతా పవన్ పైనే ఉంటుంది. ఇక క్రిష్, త్రివిక్రమ్ ఎపిసోడ్ చివరి భాగంలో పవన్ తో గెస్ట్ సీటు పంచుకోనున్నారు.

దర్శకుడు క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీర మల్లు సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలకృష్ణతో కూడా గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా రూపొందించారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ కి ఉన్న అనుబంధం గూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అంతర్గత వర్గాల సమాచారం నిజం అయితే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ల అరుదైన కలయికకు త్రివిక్రమ్ మరియు క్రిష్ లు కూడా తోడవడం ఖచ్చితంగా అందరికీ ఆసక్తిని కలిగించేదే. ఈ వార్త నిజం అవ్వాలనే కోరుకుందాం.


No comments:

Post a Comment