నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి'.
ఈ చిత్రంలో నటి శృతి హాసన్ కథానాయికగా నటించారు, కాగా తను బాలకృష్ణతో నటించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంలో హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషించారు.
ఇక బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, విజయ్ నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు చిత్రాలతో వీరసింహారెడ్డి పోటీ పడుతోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం - 15 కోట్లు
సీడెడ్ - 12 కోట్లు
యూఏ - 7.25 కోట్లు
ఈస్ట్ – 6 కోట్లు
వెస్ట్ – 5.25 కోట్లు
కృష్ణా – 5 కోట్లు
గుంటూరు – 6.75 కోట్లు
నెల్లూరు – 2.75 కోట్లు
ROI - 5 కోట్లు
ఓవర్సీస్ – 5 కోట్లు
టోటల్ – 70 కోట్లు
బాలకృష్ణ గత చిత్రం అఖండ సూపర్ హిట్ కాగా, దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా తన చివరి చిత్రం క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
కాబట్టి వీరసింహారెడ్డి సినిమా పై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి అందరి అంచనాలను అందుకుని వీరసింహారెడ్డి ఘన విజయం సాధించాలని ఆశిద్దాం.
No comments:
Post a Comment