మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం 2023 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.
ఈ చిత్రంలో రవితేజ, శృతి హాసన్, కేథరిన్ ట్రేసా, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. చిరంజీవి, శృతి హాసన్ల పై ఇటీవలే చిత్రీకరించిన చివరి పాటతో వాల్తేరు వీరయ్య చిత్రీకరణను ముగించారు.
ఇక మరో పది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుండటంతో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఓ లుక్కేద్దాం.
నైజాంలో వాల్తేరు వీరయ్య రూ.21 కోట్లకు వాల్యూ చేయబడగా, సీడెడ్ రూ.15 కోట్లు, యూఏ రూ.11 కోట్లు, ఈస్ట్ రూ.7.50 కోట్లు, వెస్ట్ రూ.6.70 కోట్లు, కృష్ణా రూ.6.30 కోట్లు, గుంటూరు రూ.8.0 కోట్లు, నెల్లూరు రూ.3.50 కోట్లకు బిజినెస్ జరుపుకుంది.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో వాల్తేరు వీరయ్య వాల్యూ 9 కోట్లు కాగా ఓవర్సీస్ లో కూడా 9 కోట్ల వరకు బిజినెస్ చేసింది. మొత్తానికి వరల్డ్ వైడ్ గా వాల్తేరు వీరయ్య 97 కోట్ల బిజినెస్ జరుపుకుంది.
మెగాస్టార్ చిరంజీవి గత రెండు చిత్రాలు ఆచార్య, గాడ్ ఫాదర్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందలేదు మరియు ఈసారి తమ అభిమాన హీరో విజయవంతమైన బ్లాక్ బస్టర్ ను ఖచ్చితంగా సాధిస్తాడని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.
No comments:
Post a Comment